Manasu Alochisthundhi

మనసు ఆలోచిస్తుంది

మనసు ఆలోచిస్తుంది !
అవును మనసు ఆలోచిస్తుంది!
ఒకప్పుడు జీవితాలలో
ఆలోచనలు తక్కువ ఆచరణలు ఎక్కువ,
కాని ఇప్పుడు ఆచరించడం ఎలావున్నా,ఆలోచనలే ఎక్కువ!
అవును మనసు ఆలోచిస్తుంది!ఒకప్పుడు ఉదయాన్నే లేచి రోజువారీ పనులు చేసుకుంటు అందరం బావుండాలని
ఆలోచించేవారు
కాని ఇప్పుడు రోజువారీ మన పనులకంటే పక్కవారి జీవితంల8 ఏం జరుగుతుందా అని చూస్తున్నాం !
అవును మనసు ఆలోచిస్తుంది!
ఒకప్పుడు ఇంటిని చక్కబెట్టుకుంటూ ఊరి మంచి-చెడులను కూడా ఆలోచించే వారు, కాని ఇప్పుడుపక్కవాడు ఏమేమి చక్కబెడుతున్నాడా అని ఆలోచిస్తున్నారు!
అవును మనసు ఆలోచిస్తుంది!
ఒకప్పుడు ఇంటికి పిల్లల జీవితాలకి సరిపడా సంపాదిస్తున్నామా అని ఆలోచించే వారు
కాని ఇప్పుడు ఇంటికి పిల్లలకే కాదు పక్కవాడికంటే ఎక్కువ సంపాదిస్తున్నామా అని ఆలోచిస్తు న్నారు.
అవును మనసు ఆలోచిస్తుంది!ఒకప్పుడు పిల్లలకి ఒక వయసు వచ్చేప్పటికి పెళ్లి చేయాలని ఆలోచించేవారు
కాని ఇప్పుడు పిల్లలకి ఒక వయసు వచ్చేప్పటికి ఎంత గొప్పవాల్లను చేయాలా అని ఆలోచిస్తున్నారు.
అవును మనసు ఆలోచిస్తుంది!
ఒకప్పుడు అందరం కలసి వుంటే
ఆనందం అనుకునే వాల్లుండెవారు
కాని ఇప్పుడు ఎవరికి వారుంటే ఆనందం అనుకున్నారు.
అవును మనసు ఆలోచిస్తుంది!
ఒకప్పుడు ఇప్పుడు కలసి ఆలోచిస్తుందిప్పుడు, అవును ఆలోచిస్తుందిప్పుడు!
ఒకప్పటి ఉమ్మడి జీవితాలు
ఇప్పటి చిన్నగా వీడిన కుటుంబాలు ఆలొచిస్తున్నాయి..
ఎవరికి వారిగా వున్నా ఒకరి గురింంచి ఒకరు ఎలా వున్నారా అని ఆలోచిస్తున్నారు.
అవును మనసు ఆలోచిస్తుంది!
ఒక్కరిని తొక్కి ఎదగాలని కోరిక తగ్గి పక్కవాల్లు ఎలా వున్నారా అని ఆలోచిస్తుంది
దీనికి కారణం కొరొన వైరస్..
కొన్ని మనసులను మార్చింది ఇంత చిన్న క్రిమా అని ఆలోచిస్తుంది.
అవును మనసు ఆలోచిస్తుంది!
మనసులను కడగలేని ఆచారాలు ,
కుల మతాలను కడగలేని ఆచారలను కూడా కడిగిస్తుందా… అని ఆలోచనలు చేయిస్తుందని
అవును మనసు ఆలోచిస్తుంది.
………………….. లక్ష్మి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *