లాక్ డౌన్ లో మానవాళి జీవనం

Lockdown_covid19_corona

హమ్మయ్య ! చక్కగా ఈ పూట వంట కార్యక్రమాలు చక చక చేసుకొని ఆలా కాలు జాపి కాసేపు టీవీ చూదాం అనుకొనేలోపు, పిల్లల ఆకలి కేకలు “అమ్మ తినటానికి ఏమైనా పెట్టు !” అని ఒకటే విన్నపాలు. అదేమిటి గంట కూడా కాలేదు కదా భోజనం చేసి అందరము, అని ఆలోచన మెదడు తట్టగానే “అయినా, ఇంటి బయట అడుగుపెట్టి చాలా రోజులు అయింది కదా ?” అన్న సంగతి జ్ఞప్తికి రావటం సహజమైపోయింది అండి ఈ “లాక్ డౌన్” పుణ్యమా అని. ఇంటిళ్ళదులు గడపదాటకుండా వారాలు తరబడి తింటూ కూర్చుని ఉంటె రోజంతా తిండి ద్యాశ – ఆటల గోషలు తప్ప ఇంకా ఏమి ఉంటాయి చెప్పండి !

పోయిన సంవత్సరం, అంటే 2019, నవంబర్ నెల మొదట వారం అనుకొంట, వార్తల్లో చైనా దేశం లో ఏదో “వైరస్” ప్రభలింది అని – ఎంతో మంది అక్కడి జనాలు దాని భారిన పడి, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని విన్నాను. ఆ రోజునించీ ఇక ఎప్పుడు వార్తలు చుసిన, పేపర్ లో చదివిన రోజు రోజు కీ “చైనా వైరస్” వార్తల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తరవాత ఇక ఆ “చైనా వైరస్” కాస్త “కోవిడ్-19” గా, ఆపై “కరోనా వైరస్” గా సుపరిచితం అయిపోయింది అందరికి. మెల్లిగా ఆ వైరస్ కాస్త చైనా దేశం ధాటి, కండాలు దాటటం మొదలు పెట్టిందని వార్తలు. సరిగ్గా మార్చ్ 2020 నెల రాగానే, మన భారత దేశం లో కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని తెలిసింది. ఇంకేముంది రోజుకో వార్త, అది పుకారో – లేక నిజమో తెలియని అయోమయం లో పడేశాయి కొన్ని ఇంటర్నెట్ వార్తలు. ఒక్కప్పుడు టీవీ లో వార్తలు మాత్రమే దేశీయ ప్రపంచవార్తలు వినిపించేవి, కానీ ఈ మధ్య టీవీ కి పోటీగా ఇంటర్నెట్ న్యూస్ లు బాగా పాపులర్ అయ్యాయీగా ! చిన్న పెద్ద వయసు తేడా లేకుండా అందరి పాకెట్స్ లో సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి, అందరికి అన్ని విషయాలపైనా అవగాహనా కాస్త ఎక్కుగానే ఉన్నట్టు ప్రవర్తన కూడా చోటుచేసుకొంది.

నెమ్మదిగా మనకు ఈ కరోనా వైరస్ గూర్చి కొన్ని విషయాలు మాత్రం బాగా అర్ధం అయ్యాయి. అది మనిషి నించి మనిషికి తుమ్మటం-దగ్గటం ద్వారా వ్యాప్తి అనేది త్వరగా చెందుతోందని, వాట్సాప్ లో మెసేజెస్ ఎక్కువైపోయాయి, వార్త కన్నా భయాలు ఎక్కువగా ఫార్వర్డ్ ఆవుతోన్నాయి. టీవీ లో గవర్నమెంట్ వాళ్ళు, ఆరోగ్యశాఖ వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా క్రమంగా ఎక్కువయ్యాయి. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వ్యాప్తికి గురవుతోన్న సందర్బంలో మన దేశం లో మార్చ్ 22న, ఆదివారము ఉదయం నించి సాయంకాలం దాకా “జనతా-కర్ఫ్యూ” పాటించాలి అని మన భారత దేశం ప్రధాని నరేంద్రమోడీ గారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసారు. భారత ప్రధాని గారి విజ్ఞప్తి మేరకు ప్రజలందరూ జనతా-కర్ఫ్యూ కి రెడీ అయ్యాం ఎంచక్కా. ఆదివారం 22ను తారీఖున, ఎవ్వరికి వారు వాళ్ళ ఇళ్లపట్టునే, హాస్టల్ లో ఉండేవాళ్ళు హాస్టలలో, ఉరికి వెళ్ళినవాళ్ళు ఆ ఊళ్లల్లోనే, పక్క రాష్ట్రం వెళ్లిన వాళ్ళు ఆయా రాష్ట్రాల్లోనే – ఎక్కడి వాళ్ళు అక్కడే బయటకు రాకుండా, ప్రయాణాలు పూర్తిగా మానుకొని ఉండిపోయారు.

ఆ రోజు ఆదివారo అవటంతో – పెద్దగా ఇబ్బంది లేకుండానే రోజంతా సరదాగే గడిసింది, టీవీ లో అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితిని చోస్తూ, పిల్లలు ఎంచక్కా వండింది తిని మొబైల్ లో గేమ్స్ ఆడుకొంటూ, సినిమాలు చూసుకొంటూ.. ఎవ్వరికి నచ్చిన విధంగా వారు సాయంకాలం దాకా గడిపి, సరిగ్గా 7గంటలకు అందరూ తమ తమ ఇంటి గుమ్మలముందు నిల్చొని ఇళ్లలో అందుబాటులో ఉన్న కంచాలు, గరిటలతో, విజిల్స్ తో , చిన్నగా-పెద్దగా శబ్దం చేసి – భారతదేశం అంత ఒక్కటే – ఒకే మాట – ఒకే బాటపైన ఉన్నామని, “భిన్నత్వంలో ఏకత్వం” మరియు మన “ఐక్యత” చాటి చుపించాము. ఇక ఆ కరోనా మహమ్మారి పీడా విరగడైంది అనుకొన్నాము.

కానీ తరవాత రోజులు వార్తలు వరదలా రాసాగాయి అన్ని రకాలుగా – టీవీల్లో, ఇంటర్నెట్ లో, వాట్సాప్ లో, పేపర్లో – కరోనా విజృంభణ ఎక్కువైపోయింది ప్రపంచనలుమూలల అని. బయటకు వెళ్లాలంటే భయం మొదలయింది – పిల్లలని బయటకి పంపాలంటే భయం, మగవారు బయట ఉద్యోగాలకి వెళ్లి రావాలంటే భయం, బయట మార్కెట్లో వస్తువులు కొనల్లనా ముట్టుకోవల్లన భయం. ఇది ఇలా ఉండగా, ప్రభుత్వం హఠాత్తుగా మర్చి 24వ తారీపైనించి సర్రిగ్గా 21రోజులు భారత దేశం మొత్తం “లాక్-డౌన్” అని ప్రకటించారు. అంటే, 21రోజులు ప్రజలెవ్వరూ ఇళ్లలోంచి పూర్తిగా బయట అడుగుపెట్టకూడదు అని అర్ధం. రవాణా యంత్రాంగం పూర్తిగా నిలిపేశారు – అత్యవసర పరిస్థితిలోనే బయటకి రావాలి అని, అది కూడా బయట గస్తీ కాస్తున్న పోలీస్ వాళ్ళు నిఘాలోనే సుమా – అయ్యో ఇదేమిటి వింత అని మొదట్లో అనిపించినా రెండు మూడు రోజులకి అలవాటైపోయింది. నెమ్మదిగా ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు, పలకరింపులు కూడా పలచబడ్డాయి. ఒక వారం తరావత, పాపం ఇంట్లోనే బందీలైపోయి పిల్లలు కూడా చిరాకు విసుకోటం మొదలు పెట్టారు. జాబ్ చేసుకొనేవాళ్ళు “వర్క్ ఫ్రమ్ హోమ్” విధానం లో ఆఫీస్ పనులు ఇంట్లోనించే చేయసాగారు.

ఇక మా ఆడవాళ్ళ సంగతి అయితే వర్ణనాతీతం అనుకోండి ! అటు పిల్లలను కంట్రోల్ చేసుకొనంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, భర్తకి టైం కి భోజనాలు అందించి – వంటగది కె పూర్తిగా పరిమితం అయిపోయాం అనుకోండి ఈ కరోనా లాక్ డౌన్ దెబ్బకి. ఇంటి సరుకులు నిండుకోటం ఒక పెద్ద సమస్య అయిపోయింది, రకరకాల వంటలు వండటం – చిరుతిండ్లు చేయటం వలన అనుకొంటా. బయటకి వెళ్లాలంటే మొహానికి “మాస్క్” వేసుకొని వెళ్లాల్సిందే, అది పోలీస్ వాళ్ళు ఆర్డర్ ప్రకారం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు టైం ప్రకారం అనుమతి తో. ఇలా చాలా విధానాలు పాటించాల్సి వచ్చింది ఆ రోజునించీ. ఆలా అలా రోజులు గడిచాయి మొదటి లాక్ డౌన్ క్రమం లో. తక్కిన విషయాలు ఎలా ఉన్న, పాపం ప్రపంచ దేశాలు కరోనా ఉదృతికి తట్టుకోలేక విలవిలలాడటం న్యూస్ లో చూసి చాలా భయం వేసింది. మనం అలంటి పరిస్థితి రాకుండా ముందుగానే, కష్టమైన సరే, గవర్నమెంటు వాళ్ళ సూచనలు ఆదేశాలు తప్పక పాటించాలి అని నిర్ణయించుకున్నాం – మన ఆరోగ్యం కన్నా ప్రాణాలు భద్రంగా ఉండటం మరీ ముఖ్యం కదామరి?

21రోజులు పూర్తి కాకముందే భారత ప్రభుత్వం వారు లాక్ డౌన్ ని పొడిగించి 2వ దఫా లాక్ డౌన్ ని వెంటనే ప్రకటించింది. ఇంకేముంది అందరి గుండెల్లో బాంబు పేలింది అనుకోండి.. 21 రోజులకే తల ప్రాణం తోకకి వచ్చేసింది, ఇంకా పొడిగింపు అంటే మన పరిస్థితి ఎలా ఉంటాదో ఆలోచనకి కూడా అందనట్టుగా అనిపించింది.

ప్రజలకు అందరికి పనులు లేవు కదా, కూలి నాలి చేసుకొని బ్రతికే వాళ్ళు పాపం తినటానికి కూడా ఏమి లేని పరిస్థితి వచ్చేసింది. ఉన్నవాళ్లు సరే – మధ్యతరగతి కుటుంబాలు ఎలాగోలా సద్దుకోవచ్చు, ఒంటి పూట తినైన సరే అనుకొచు, కానీ పాపం పేద వాళ్ళు, పక్క రాష్ట్రం నించి వచ్చిన వలస కూలీలా మాటేంటి ? ప్రభుత్వం ఇంకా వాలంటీర్ సంస్థలు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తోన్నారు – వాళ్ళకి ఆశ్రయం కలిపించి ఇంకా తిండి పెట్టటానికి – కానీ అందరికి అందటం కష్టం కదా ?

దేశ ప్రభుత్వం ప్రయాణ సాధనాలు అన్నీ రద్దు చేసారు కదా అందుకని, తప్పనిసరి పరిస్థితిలో చాలా మంది వలస కూలీలా కుటుంబాలు దేశం మొత్తం బారులుగా కాలినడకన తమ తమ ఊళ్ళకి బయల్దేరుతున్నారు అని వార్తలు వచ్చాయి. చిన్నా పెద్ద, గర్భినిలు, ఆడామగా తేడాలేకుండా హైవే రోడ్డు ఎక్కి తండోపతండాలుగా ప్రయాణాలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితికి ఎవ్వరైనా గుండె బరువెక్కి కంటతడి పెట్టాల్సిందే పాపం. చాలామంది విశాలహృదయులు తమ వంతు సహాయం అందించే ప్రయత్నం మాత్రం ఆపలేదు సుమా!

చిన్న చితక ఆస్పత్రులు సైతం మూతబడ్డాయి, ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి కాల్ చేసి సలహాలు సూచనలు పాటించాల్సిందే, కరోనా లక్షణాలు ఒక్కటి ఉన్న సరే గవర్నమెంట్ అంబులెన్సు హుటాహుటిన అక్కడికి చేరుకొని వారిని వెంటనే ప్రభుత్వ “క్వారంటైన్” కేంద్రానికి తరలించసాగాయి. క్వారంటైన్ అంటే చాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తటం మొదలు పెట్టాయి అనుకోండి. లాక్ డౌన్ పుణ్యమా అని కొత్త కొత్త పేర్లు, వాటి అర్ధాలు, వాటి విధానాలు, తూచాతప్పక పాటించాలి అనే కొత్త నిబంధనలు అన్ని వెంట వెంటనే మన జీవితలోక్కి వచ్చి చేరాయి. మెల్లిగా అన్ని అలవాటు అయిపోతున్నాయి అనిపించాయి. పేదవాడి కష్టాలు, మధ్యతరగతి కుటుంబాల ఆందోళనలు, ఉన్నవాడి హడావిడీలు, దయాగుణాల వ్యాప్తి, ఆరోగ్య కేంద్రాల్లో ప్రాణాలు పణంగా పెట్టి రాత్రియంబవళ్ళు పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఆశా మరియు హెల్త్ వర్కర్స్, ఇల్లు కుటుంబాలు సైతం మరిచి నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో విషయాలు రోజు వార్తల్లో వినసాగాము. అందరూ తమ వంతు సహాయంగా ఏదో ఒకటి చేసే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు పాపం. బయట ఇబంది పడుతోన్నవాళ్లకి ఏమి సహాయం చేయలేము అనుకునేవాళ్లు తమవంతు కృషి గా అనవసరంగా రోడ్లపైకి వెళ్లకుండా చక్కగా ఇంట్లోనే ఉన్నారు. ఇది ఒక విధంగా మంచి చేసినట్టే కదా మరి సమాజానికి. ఎందుకంటే, ఈ క్లిష్ట సమయం లో ఎవ్వరు బయటకి రాకుండా ఇళ్లకే పరిమితం అవుతే ఆ కరోనా మహమ్మారి త్వరగా అంతమవుతుంది కదా మరి.

కరోనా వైరస్ వళ్ళ కష్టాలు, కన్నీటి కధలు కొల్లలు అన్న సంగతి నిజమే, ఐన సరే మరో వైపు ఈ కరోనా వ్యాప్తి అరికట్టే దిశగా లాక్ డౌన్ ప్రక్రియ వలన కొన్ని చెప్పుకోదగ్గ లాభాలు కూడా చవిచూస్తోన్నాము. అది ఎలా అంటారా ? తల్లిదండ్రులు – పిల్లలు అందరూ ఇంట్లోనే ఉండిపోటం వాళ్ళ, బయట అన్ని రకాల షాపులు, మార్కెట్లు, హోటళ్లు, స్విగ్గీ – జొమాటో లో ఆర్డర్లు వగైరా వగైరాలు పూర్తిగా మూసివేయటం వాళ్ళ, ఏమి చేయాలన్న, తినాలన్న – తప్పని సరిగా ఇంట్లో వండినదే గతి కదా. ఇన్నాళ్లు బయట తిండి కి బాగా అలవాటుపడి కాస్తో కూస్తో ఆరోగ్యాలు సైతం పాడుచేసుకొన్నారు. ఇప్పడు హాయిగా ఇంట్లో వండిన వంటలు మాత్రమే తిని ఆరోగ్యాన్ని తిరిగి పొందుతోన్నరు అందరూ ! మగవాళ్ళు కూడా ఇంటిపనిలో సహాయం చేస్తున్నారు చాలా కుటుంబళ్లలో, పిల్లలు కూడా ఎప్పటిలాగే మొబైల్ ఫోన్లకు అతుక్కుపోకుండా కాస్త పాతబడి మూలాన పడ్డ ఆటపాటలు తెలుసుకొని కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. కుటుంబికులమధ్య మరుగునపడ్డ ప్రేమాభిమానాలు కూడా చాలా వరకు సద్దుకోసాగాయి.

“ఫాస్ట్ లైఫ్ స్టైల్ కల్చర్” కి అలవాటుపడి, ఒకే ఇంట్లో ఉంటూ కూడా రోజుకి ఒక నిమిషమైన మాట్లాడుకోలేని పరిస్థితినించి బయటపడ్డారు. ఇప్పుడు రోజంతా ఇంట్లో కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకొని మానసిక ఆనందానికి దగ్గరయ్యారనే అనాలి. ఒక కుటుంబం లో భర్త తన భార్య-పిల్లలు, భార్య తన భర్త-పిల్లలు ఎలా మెలుగుతోన్నారో, వారి మనోభావాలు, ఇష్టాయిష్టాలు క్షుణ్ణంగా తెలుసుకొనే అవకాశం అయితే వచ్చిందని అనుకోవాల్సిందే అండీ! అంతేగాక, ఊరిలో ఉండే చుట్టాలు, స్నేహితులు – రోజుకి ఒక్కసారైనా మన క్షేమసమాచారాలు తెలుసుకొనే ప్రయత్నం, ప్రేమాభిమానాలు పంచుకునేలాగా ఒక చక్కటి అవకాశం ఇచ్చిందండి ఈ “లాక్ డౌన్” పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే, మనుషులు దూరంగా ఉన్న మనిషికి-మనిషికి మధ్య పూర్వమున్న ప్రేమలు, పలకరింపులు, అభిమానాలు పెంచిందనే అనాలి. అలాగే, మరుగునపడ్డ కొన్ని భారతీయ సంప్రదాయాలు కూడా తిరిగి వాడుకలోకి రావడం సంతోషకరమైన అంశం. అలాగా అంటారా, అవసరానికి బయటకి వెళ్ళివచ్చినపుడు చేతులు కాళ్ళు ఖచ్చితంగా చక్కగా కడుకోటం లేదా స్నానం చేయటం, భోజనానికి ముందు తప్పనిసరి అందరం చేతులు శుభ్రంగా కడుకోటం, చిన్నపెదా అందరూ “షేక్హ్యాండ్లు” పక్కన పెట్టి ఎంచక్కా రెండు చేతులు జోడించి “నమస్కారాలు” పెట్టే అలవాటు మొదలయింది. మన భారత దేశంలోనే గాక ఇతర దేశాల్లో కూడా చాలా మంది మన “నమస్కారాల” సంప్రదాయాన్ని పాటిస్తున్నారని వార్తల్లో సైతం వినిపించాయి కదా. మన భారతీయ సంస్కృతి కేవలం ఒక మతానికో, కులానికో చిహ్నం కాదనే నిజ్జాని మనందరితోపాటు విదేశీయులు సైతం గుర్తించేలా చేసింది అండీ ఈ క్లిష్టమైన సందర్భం. ఈ విపత్కరపరిస్థితిలో పేదవాడి కష్టాన్ని కూడా అందరికి తెలిసేలా చేసింది ఈ కరోనా మహమ్మారి, చాలామందిలో హృదయం చలింపజెసి – మనుషుల్లో మానవత్వం బయటపడేలా చేసి చేతనైనంత సహాయచర్యలు చేసేలాగా కూడా చేసింది కదా. అవకాశం వచ్చినప్పుడు మనిషిలో ఉన్న “మనీషి సద్గుణం” అన్నది బయటపడుతోందని మనకు అర్ధమయ్యేలా చేసింది కదా ఈ కరోనా వైరస్ ! మనిషికి-మనిషికీ, కుటుంబానికి-కుటుంబానికీ, ప్రాంతాలకు-ప్రాంతాలకి మధ్య దూరం అన్నది కేవలం కృత్రిమంగా ఏర్పరుచుకొన్నది మాత్రమే అని అర్ధమవుతున్నది. సందర్భం – అవకాశం వచ్చినప్పుడు మనిషిలోని నిజమైన ప్రేమాభిమానాలు, దయాగుణం అనేది బయటపడేలా చేస్తుంది.

ఈ కరోనా మహమ్మారి ఇంకా ఎన్ని రోజులు ప్రపంచం లో తన “స్వైరవిహారం” చేస్తుందో తెలియదు గానీ, దాని బారిన పడకుండా మాత్రం ఎలా ఉండాలో అన్నది మనకు బాగా తెలిసిన సంగతే ఇప్పుడు. చాలా వరకు అన్ని ప్రభుత్వ-ప్రైవేటు కార్యాలయాలు మెల్లిగా తమ తమ కార్యకలాపాలు మొదలుపెట్టసాగాయి. పిల్లల స్కూళ్లు మాత్రం తెరుచుకోవాలంటే ఇప్పట్లో కష్టమే, ఎందుకంటే ఈ వైరస్ కి ఎక్కువగా గురయ్యే ప్రమాదం పిల్లలకి ఇంకా వయస్సుపైబడినవాళ్ళే అంటా. వీలైనంత జాగర్తగా, శుభ్రంగా ఉండటం నేర్చుకోవాలి మనం అందరం. బయట పనుల్లోకి వెళ్ళేవాళ్ళు చాలా జాగర్తలు పాటించాలి.

ఇంకా చాలా విషయాలు చెప్పాలనే ఉంది గాని నాకు కూడా పెండింగ్ ఇంటిపనులు ఉన్నాయండోయ్, మల్లి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా మాట్లాడుకొందాం, సరేనా ? ఉంటానండి మరీ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *